హైదరాబాద్ సిటీబ్యూరో, మలక్‌పేట, మే 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.సైదాబాద్ డివిజన్ హమాలీ బస్తీలోని హోలీ మదర్స్ గ్రామర్ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం(64)లో ఉదయం పోలింగ్ సరళిని పరిశీలనకు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత వెళ్లారు. ఈ క్రమంలో రఫత్ ఉన్నీసా (బుర్ఖాలో వచ్చిన మహిళ) ఐడీ కార్డు తీసుకొని తన ముఖాన్ని చూపించాలని కోరగా, ఆమె ముఖ పర్దాను తొలగించి,ముఖాన్ని చూపించారు.ఆధార్ కార్డు లో ఉన్న ఫొటోతో ముఖం మ్యాచ్ అవటంలేదని చెప్పిన ఆ మహిళను పంపించాలని బీఎల్వోకు మాధవీలత చెప్పారు.
దీంతో రఫత్ ఉన్నీసా వెళ్లిపోవటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటం తో బీఎల్వో అరుణ మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాధవీలతపై కేసు నమోదు చేశారు. కాగా, సంతోష్‌నగర్ కాలనీలోని గోల్డెన్ జూబ్లీ స్కూల్లోని పోలిం గ్ కేంద్రంలో బాలిక ఓటు వేసినా పోలీసు లు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని, వీరు ఎంఐఎంతో కుమ్మక్కై రిగ్గింగ్‌కు సహకరించారని మాధవీ లత ఆరోపించారు. చాంద్రాయణగుట్ట, రియాసత్‌నగర్ డివిజన్లో 40వ నంబర్ పోలింగ్ బూత్‌ను ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు నివా స గృహంలో ఏర్పాటు చేయడమే కాకుండా యథేచ్ఛగా ఇంటి గేట్లు మూసివేసి,రిగ్గింగ్ పాల్పడ్డారని మాధవీలత ఆరోపించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది.