జడ్జి కుమారుడిపై కేసు
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్‌హెచ్‌వోను హెచ్చరించింది.
- ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యంపై ఎస్‌హెచ్‌వోకు హైకోర్టు హెచ్చరిక
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేయడంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు కరీంనగర్ టూటౌన్ ఎస్‌హెచ్‌వోను హెచ్చరించింది. తనపై రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కుమారుడు వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యానికి దారితీసిన కారణాలను తెలియజేస్తూ ఎస్‌హెచ్‌వో వెంకట్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 13న మరో కేసు విచారణ ఉండటంతో తాను స్టేషన్లో అందుబాటులో లేనని, బాధితురాలి సమస్య 14న తన దృష్టికి వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వివరణ ఇచ్చారు. దీంతో ఇకపై జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం వెంకట్‌ను హెచ్చరిస్తూ.. బాధితురాలి పిటిషన్‌పై విచారణను ముగించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

