నిర్మల్ అర్బన్, జూన్ 6: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి, అతని అనుచరులు నిర్మల్లో ధర్నా నిర్వహించారు.
అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతోపాటు నినాదాలు చేస్తూ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లి ఉద్యోగుల విధులకు ఆటంకపరచడంతో కేసు నమోదు చేసినట్టు నిర్మల్ సీఐ మల్లేశ్ తెలిపారు.