అయ్యో.. బిడ్డా.. తల్లీకొడుకు ప్రయాణిస్తున్న బైక్‌ను వేగంగా ఢీకొన్న కారు..
నవ మాసాలు మోసి కని, 19 ఏండ్లపాటు పెంచిన కొడుకు.. తల్లి కళ్లెదుటే రక్తపు మడుగులో కొట్టుకుంటూ కన్ను మూస్తే.. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.
- తల్లి కండ్లెదుటే కొడుకు మృతి..
- తల్లి విజయలక్ష్మికి గాయాలు..
పాల్వంచ, ఏప్రిల్ 5: నవ మాసాలు మోసి కని, 19 ఏండ్లపాటు పెంచిన కొడుకు.. తల్లి కళ్లెదుటే రక్తపు మడుగులో కొట్టుకుంటూ కన్ను మూస్తే.. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఆదివారం సరిగ్గా ఇదే విషాదకర ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రాం జయంత్యుత్సవానికి అతిథిగా పాల్వంచ కరకవాగు గ్రామానికి చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ భట్టు విజయలక్ష్మిని నిర్వాహకులు ఆహ్వానించారు. పాల్వంచ బస్టాండ్ ఎదురుగాగల బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్దకు వెళ్లేందుకు ఆమె తన కుమారుడు భట్టు అఖిల్నందన్ అలియాస్ విక్కీ(19) బైక్‌పై ఆదివారం బయల్దేరారు.
కరకవాగు నుంచి బస్టాండ్ మూలమలుపు తిరుగుతుండగా, వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు (టీఎస్ 28 జీ 9414) ఢీకొన్నది. తల్లీకొడుకు కింద పడిపోయారు. విక్కీ తలపై నుంచి కారు దూసుకెళ్లింది. విక్కీ అక్కడికక్కడే మృతి చెందాడు. విజయలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించారు. ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

