హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందినా పార్టీ గుర్తులో ఎలాంటి మార్పు ఉండదు. టీఆర్ఎస్ మాదిరి..బీఆర్ఎస్కు కారు గుర్తే కొనసాగనున్నది. రంగు కూడా గులాబీయే. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించడంతో పార్టీ గుర్తు, రంగుపై సర్వత్రా చర్చ జరుగగా బుధవారం జరిగిన సమావేశంలో స్పష్టత వచ్చింది.
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో ఇకపై ప్రతిచోటా టీఆర్ఎస్కు బదులు బీఆర్ఎస్ అని వినియోగించాల్సి ఉంటుంది. రాయడం, పలకడం, ప్రచారం, చివరకు కండువాలు, ఫ్లెక్సీల్లోనూ బీఆర్ఎస్ పేరునే వాడాలి. టీఆర్ఎస్ అనుబంధ సంఘాలు, సంస్థలు కూడా ఇందుకనుగుణంగా పేరు మార్చుకోనున్నాయి.