Warangal | కరీమాబాద్, మే 11 : చెల్లిని పరీక్ష రాయించేందుకు తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్క దుర్మరణం చెందింది. వరంగల్ జిల్లా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన నాగపురి కాళి-సంధ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు నాగపురి తన్మయ్(23), సాయిహర్షిత ఉన్నారు.
సాయిహర్షితను ఎప్‌సెట్ రాయించేందుకు తల్లి, పెద్ద కూతురు తన్మయ్‌తో కలిసి కారులో శనివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ఘట్కేసర్ సమీపంలో కారును డీసీఎం ఢీకొట్టడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాగపురి తన్మయ్ (23) అక్కడికక్కడే మృతిచెందగా, మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో కరీమాబాద్‌లో విషాదం నెలకొన్నది.