హైదరాబాద్‌లో గంజాయి కలకలం.. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో 20 కిలోలు స్వాధీనం
భాగ్యనగరం గంజాయి దందాకు అడ్డాగా మారుతున్నదా?.. స్మగ్లర్లు హైదరాబాద్‌ను గంజాయి విక్రయ కేంద్రంగా మార్చుకుంటున్నారా?.. అంటే అవుననేందుకు తాజా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
- నగరాన్ని ముంచెత్తుతున్న మాదకద్రవ్యాల మాఫియా
- విశాఖ నుంచి సరఫరా.. శివారు ప్రాంతాల్లో విక్రయం
- కూలీలు, యువకులనే ఏజెంట్లుగా మార్చుకుంటున్న స్మగ్లర్లు
- నగరమంతా విస్తరిస్తుండటంతో ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన
హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : భాగ్యనగరం గంజాయి దందాకు అడ్డాగా మారుతున్నదా?.. స్మగ్లర్లు హైదరాబాద్‌ను గంజాయి విక్రయ కేంద్రంగా మార్చుకుంటున్నారా?.. అంటే అవుననేందుకు తాజా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకేరోజు రెండు చోట్ల 20.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం నగరంలో గంజాయి వ్యాపారం ఎంతగా విస్తరించిందో స్పష్టం చేస్తున్నది. విశాఖ ఏజెన్సీ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు విస్తరిస్తున్న గంజాయి నెట్వర్ శనివారం మరోసారి బయటపడింది. ఒక్కరోజే చందానగర్, కొంపల్లి ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఆపరేషన్లలో గంజాయి పట్టుబడటం గమనార్హం. కూలీల నుంచి విద్యార్థి, యువకుల వరకు స్మగ్లర్ల వలలో చికుకుంటుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఎస్టీఎఫ్ వరుస దాడులతో ముఠాలు బయటపడుతున్నా.. నగరంలో గంజాయి దందా కొత్తమార్గాల్లో విస్తరిస్తూనే ఉండటం ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన కలిగిస్తున్నది.
కూలి పనుల నుంచి గంజాయి వ్యాపారం వరకు..
బిహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన సన్నీకుమార్ జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. కొంతకాలం కూలీగా పనిచేసిన అతను సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి వ్యాపారంలోకి దిగినట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. విశాఖపట్నం నుంచి 14.77 కిలోల గంజాయి కొనుగోలు చేసి రైలులో లింగంపల్లికి చేరాడు. అకడి నుంచి చందానగర్‌లోని వినియోగదారులకు సరఫరా చేసేందుకు వెళ్తుండగా, ముందస్తు సమాచారంతో ఎస్టీఎఫ్ బీటీమ్ సీఐ భిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు నేతృత్వంలోని బృందం అతడిని అదుపులోకి తీసుకున్నది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.7.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
కొంపల్లిలోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్టీఎఫ్ ఏటీమ్, మేడ్చల్ డీటీఎఫ్ సంయుక్తంగా దాడులు చేశాయి. సీఐ ఎంఆర్పీ చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ నర్సిరెడ్డి నేతృత్వంలోని బృందాలు నిర్వహించిన తనిఖీల్లో 5.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హట్‌గడ్ సునీల్‌ను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు హట్‌గడ్ అమన్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
విశాఖ ఏజెన్సీ టు హైదరాబాద్..
దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో తకువ ధరకు లభించే గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇకడ దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి మూడు నుంచి నాలుగు రెట్ల అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కిలో గంజాయిని వంద గ్రాముల చొప్పున విక్రయిస్తుండగా భారీ లాభాలు వస్తుండటంతో యువకులు, వలస కూలీలను స్మగ్లర్లు తమ నెట్వర్లోకి లాగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. గంజాయి తరలింపునకు ప్రధానంగా రైలు మార్గాలనే వినియోగిస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు తెలిపారు.
శివారు ప్రాంతాలే లక్ష్యంగా..
గతంలో ధూల్‌పేట్ కేంద్రంగా సాగిన గంజాయి వ్యాపారం ఇప్పుడు నగర శివార్లకు విస్తరించింది. కొంపల్లి, చందానగర్, లింగంపల్లి, మియాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి, మేడ్చల్, మలాజిగిరి, అమీర్‌పేట్ పరిసరాల్లో చిన్నస్థాయి డీలర్లు పెరుగుతున్నట్టు ఎక్సైజ్‌శాఖ పరిశీలినలో తేలింది. కాలేజీ విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, వలస కూలీలను గంజా యి మాఫియా లక్ష్యంగా చేసుకుంటున్నది. నగరంలోని ఓ పేరుమోసిన ఇంజినీరింగ్ కాలేజీ వద్ద గంజాయి అడ్డాలు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఒక ముఠా పట్టుబడితే, మరో ముఠా వెలుగులోకి వస్తున్నది. ఈ ముఠాలను పట్టుకునేందుకు అధికారులు ప్రాధాన్యమిస్తున్నారు కానీ, మూలాల ఛేదనలో ప్రయత్నాలు జరుగటం లేదనే విమర్శలున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

