హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్‌ను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని హైకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానించింది.
సోమవారం ఉదయం అత్యవసరంగా సమావేశమై సుప్రీంకోర్టు కొలీజియంకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రపతితోపాటు సుప్రీం సీజే, ప్రధాని, న్యాయశాఖ మంత్రి, తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఈ సమవేశంలో నిర్ణయించారు.