Minister Srinivas Goud | అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా పాలమూరు జిల్లా పరిధిలోని మన్యంకొండ ఆలయం వద్ద కేబుల్ కారు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్న FITUR – 2023 కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడున్న కేబుల్ కారు వ్యవస్థను శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పెయిన్ పర్యటనలో భాగంగా కేబుల్ కారు పనితీరును పరిశీలించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేబుల్ కారు మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ దేవాలయం వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఒక సంవత్సర కాలంలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్న FITUR – 2023 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ టూరిజంను శ్రీనివాస్ గౌడ్ ప్రమోషన్ చేశారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపదను మంత్రి వివరించారు. పర్యాటకులకు కనువిందు చేసే జలపాతాలు, సెలయేర్లు, దేవాలయాలు, వైల్డ్ టూరిజం, ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, ట్రైబల్ సాంస్కృతి, మెడికల్ టూరిజం, బతుకమ్మ పండుగ గొప్పతనం గురించి కూడా తెలియజేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కేబుల్ కారు ఏర్పాటు.
1 సంవత్సరంలో పనులు పూర్తి.
పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. pic.twitter.com/vj8lCQaX8f
— V Srinivas Goud (@VSrinivasGoud) January 24, 2023