కటాఫ్లు.. కొర్రీలపై భిన్నాభిప్రాయాలు!
కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి ఉన్న నేపథ్యంలో వాటి అమలుపై క్యాబినెట్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమైనట్టు సమాచారం
- క్యాబినెట్లో వాడివేడి చర్చ
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి ఉన్న నేపథ్యంలో వాటి అమలుపై క్యాబినెట్లో భిన్నాభిప్రాయలు వ్యక్తమైనట్టు సమాచారం. గురువారం అసెంబ్లీ హాల్లో క్యాబినెట్ సమావేశం జరిగింది. వాస్తవానికి గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపే సమావేశం సాధారణంగా అరగంటలో అయిపోతుంది. కానీ.. గురువారం దాదాపు గంటన్నరపాటు సాగింది. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీల అమలుకు అయ్యే ఖర్చులపై మంత్రివర్గం లెక్కలు వేసినట్టు సమాచారం. అన్నీ అమలు కావాలంటే ప్రస్తుత బడ్జెట్ కంటే మూడింతల నిధులు కావాలని తేలినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో పథకాల అమలులో కొర్రీలు పెట్టాలని కొందరు సూచించినట్టు సమాచారం. రైతుబంధు 5 ఎకరాల లోపువారికే ఇవ్వాలని, మహాలక్ష్మి పథకంలోనూ కోతలు పెట్టాలని, బస్సుల సంఖ్య తగ్గించి నష్టాన్ని నివారించాలని సూచనలు వచ్చినట్టు తెలిసింది. అయితే అందరికీ, అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు కొర్రీలు పెట్టడం కరెక్ట్ కాదని ఇద్దరు, ముగ్గురు మంత్రులు సూచించినట్టు సమాచారం. లెకలు వేసుకోకుండా ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారని ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ వాదన కాస్త సీరియస్గా సాగుతుండటంతో మరో మంత్రి కలుగజేసుకుని శాంతిపజేసినట్టు చెప్పుకుంటున్నారు. సమావేశం రసాభాస అయ్యే సూచనలు ఉండటంతో మ్యానిఫెస్టో హామీలు, ఆరు గ్యారెంటీలపై చర్చను అర్ధంతరంగా ముగింపు పలికినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

