హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వీబీ జీ రామ్జీ పథకం అమలుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని నిర్ణయించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎల్నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, జాగ్రత్తలతో పాటు మెట్రో రైల్, తెలంగాణ-ఏపీ ఉద్యోగుల బదిలీలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
ఆర్టీఏలో ‘ఈఎంఈఎస్’
హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ) : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు రవాణా శాఖలో రోడ్డు భద్రతపై ఎలక్ట్రానిక్ మానిటరింగ్, ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్(ఈఎంఈఎస్) డిజైన్ అథారిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్-167 ఎ(1) ప్రకా రం ఈ అథారిటీలో రవాణా శాఖ కమిషనర్ చైర్మన్గా, సీనియర్ ట్రాఫిక్ అధికారి, ఐటీఈసీ శాఖ నుంచి నామినేటెడ్ ప్రతినిధి, లీగల్ మె ట్రాలజీ నుంచి ఒకరు, ఐఐటీ ఫ్యాకల్టీ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని తెలిపింది.