హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనున్నది. సమావేశంలో రుణమాఫీని ప్రధాన ఎజెండాగా తీసుకొని చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట్ర బడ్జెట్ పద్దులు, అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. వీటితోపాటు మరికొన్ని అంశాలను కూడా ఎజెండాలో ఉంచినట్టు సమాచారం.