మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు ఆదివారం తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో సమావేశం కొనసాగనున్నది.