హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో సమావేశం కొనసాగనున్నది. ఎన్నికల కోడ్ ఈ వారంలో రానున్నదన్న వార్తల నేపథ్యంలో పలు అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంచనా వేస్తున్నారు.