Assembly Session | రేపు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై చర్చ
మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు ఆదివారం తెలిపారు.
- 15 నుంచి బడ్జెట్ సమావేశాలు?
- 17న రాష్ట్ర బడ్జెట్‌కు అవకాశం
- ఒకట్రెండు రోజులు అటు ఇటుగాపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్?
Assembly Session | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తేతెలంగాణ): మంగళవారం శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు ఆదివారం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ ధ్రువీకరించారని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా లేఖలు పంపినట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ తదితర అంశాలపై నిర్వహించనున్న ఈ ప్రత్యేక సమావేశాలను ఒక్కరోజులోనే ముగించనున్నారు.
17న రాష్ట్ర బడ్జెట్?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 15 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. బడ్జెట్ సమావేశాల తొలిరోజున గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అనంతరం 17న రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఒకట్రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించి, సభను వాయిదా వేస్తారని, పద్దులపై చర్చ, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వంటివాటిని మార్చి రెండో వారంలో చేపడతారని తెలిసింది.
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే మధ్యకాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుందని చెప్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇదే నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు ఒక రోజు ముందుగాని, వెనుక గాని పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

