హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, నలుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ, మంత్రివర్గంలో స్థానం కోసం సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా పోటీ పెరగడంపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత కే జానారెడ్డి పార్టీ అధిష్ఠానానికి లేఖ రాయడంతో మంత్రివర్గ విస్తరణ మరో 5-6 రోజులు వాయిదా పడినట్టు సమాచారం.
ప్రస్తుతం పార్లమెంట్లో కీలకమైన బిల్లులు చర్చ జరుగుతున్నందున రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 4 వరకు అనుమతిచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.