మహబూబ్ నగర్ : పంజాబ్ తరహాలో సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మహబూబ్ నగర్ రూరల్ మండలం జమిస్తాపూర్ లో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రైతులతో కలిసి ఇంటిపై నల్ల జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్రం పై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.