మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రజల భగ్గుమంటున్నారు. తెలంగాణలోని ధాన్యాన్ని కొనమని చెప్పడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా వివిధ రూపాల్లో ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. జిల్లాలోని మహబూబ్నగర్ రూరూరల్ మండలం కోడూరు గ్రామపంచాయతీ కేంద్రం తీరును తీవ్రంగా నిరసించింది.
ఈ మేరకు.. పంజాబ్ రాష్ట్రంలో పంటలను కొనుగోలు చేసిన విధంగాగే తెలంగాణ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని గ్రామ పంచాయతీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఏక గ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మాన ప్రతిని భారత ప్రధానమంత్రి మోదీకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తదితరులు ఉన్నారు.