దంతాలపల్లి/ సూర్యాపేట, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన రైతుల ఎడ్లబండ్ల యాత్రకు ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తున్నది. ఆయా గ్రామాల్లో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మహిళలు పెద్ద ఎత్తున కోలాటాలు వేస్తూ స్వాగతం పలుకుతుండడం విశేషం. బుధవారం రాత్రికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చేరుకుంది. తొలి రోజు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించగా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మద్దిరాలకు చేరుకొని అక్కడే రాత్రి బసచేశారు. మద్దిరాల లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఎడ్లబండ్లకు స్వాగతం పలికారు. బుధవా రం దంతాలపల్లికి చేరుకోగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎడ్లబండిలో మాజీ మంత్రి కొంతదూరం ప్రయాణించారు.