హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): సిద్దిపేటలో తిరుమ ల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆల యం ఏర్పాటు చేయాలని మాజీ మం త్రి హరీశ్‌రావు టీటీడీ చైర్మన్‌ను కోరా రు. మంగళవారం తిరుపతి వెళ్లిన హరీశ్‌రావు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిశారు. సిద్దిపేట కోమటి చెరువు ప్రాంతంలో టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని, ఆలయం కోసం ఇప్పటికే 5ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని తెలిపారు. గతంలోనే టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు స్థలాన్ని పరిశీలించి ఆలయ నిర్మాణ నమూనా, డిజైన్స్‌ను రూపొందించినట్టు పేర్కొన్నారు. వచ్చే టీటీడీ బోర్డు మీటింగ్‌లో సిద్దిపేటలో వేంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, మీరే నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాలని బీఆర్ నాయుడిని కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ బీఆర్ నాయుడు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.