బుద్ధవనం గొప్ప నిర్మాణం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్‌లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
- కొలంబోలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నాగార్జునసాగర్‌లో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టు బౌద్ధ ధర్మ ప్రతి రూపమని రాష్ట్ర పర్యాటక, సాంసృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇండియా-హాలీవుడ్-శ్రీలంక సంయుక్త భాగస్వామ్యంతో శ్రీగగన్ మాలిక్ పాత్రతో నిర్మిస్తున్న ఎన్‌లైటెడ్ వన్-ది బుద్ధ మూవీ ప్రచార కార్యక్రమాన్ని కొలంబోలోని సిన్నమన్ హోటల్లో లైట్ ఆఫ్ ఆసియా సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం అట్టహాసంగా నిర్వహించగా, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై ప్రసంగించారు. బుద్ధవనం ప్రత్యేకతను వివరించారు. బుద్ధుడి జీవితకాలంలో బౌద్ధధర్మం తెలంగాణలో ప్రవేశించిందని, దాదాపు 100 ఏండ్లనాటి బౌద్ధం ఆనవాళ్లు ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఎన్‌లైటెడ్ వన్ ది బుద్ధ మూవీ ప్రచారంలో భాగస్వామ్యం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకుడు నవీన్ గుణవర్ధనే, బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శివనాగిరెడ్డి, టాలీవుడ్ యాక్టర్ బుద్ధుని పాత్రధారి గగన్ మాలిక్, రామాయణ సీరియల్ సీత పాత్రధారి డాక్టర్ మవందిక సిరివర్ధన, ఇండియా హైకమిషన్ ప్రతినిధి అనురాగ్ దత్త, శ్రీలంక టూరిజం బోర్డ్ చైర్మన్ చాలక గజాభావు తదితర కొలంబో శ్రీలంక బౌద్ధ అభిమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

