నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఘటన
ఇందల్వాయి, డిసెంబర్ 16 : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన లారీ డ్రైవర్ మహ్మద్‌సల్మాన్ (48) జాతీయ రహదారిపై ఓ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం సాయంత్రం లారీ నిలిపాడు. ఇంతలో మరో లారీలో వచ్చిన ముగ్గురు దుండగులు రాడ్‌తో సల్మాన్‌పై దాడిచేసి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
కాల్పుల కలకలం అవాస్తవం
మృతుడు కాల్పుల్లో చనిపోలేదని రాడ్‌తో కొట్టడంతో మృతి చెందాడని స్థానికులు ప్రత్యక్షంగా చూసి చెప్పినట్టు ఎస్సై తెలిపారు. జిల్లా దవాఖాన వైద్యులు సైతం ఇదే నిర్ధారించారని పేర్కొన్నారు.