కామారెడ్డి : కామారెడ్డి(Kamareddy) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామేశ్వర్పల్లి వద్ద ఓ వ్యక్తిని కత్తితో దాడి చేసి హతమార్చారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఆరేపల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఆటోలో ఒంటరిగా వెళ్తున్నాడు. ఇదే క్రమంలో ముగ్గురు దుండగులు రామేశ్వర్పల్లి వద్ద అడ్డుకొని కత్తితో దాడి చేసి కిరాతకంగా హతమార్చి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నవీన్ మృతితో ఆరేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.