హైదరాబాద్,నవంబర్ 28 (నమస్తేతెలంగాణ): భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ, సీఐటీయూ కూటమి ఘనవిజయం సాధించింది. సమీప ప్రత్యర్థి ఐఎన్టీయూసీపై 116 ఓట్లతో జయకేతనం ఎగురవేసింది. గురువారం జరిగిన పోలింగ్లో మొత్తం 1550 ఓట్లకు గానూ 1512 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్టీయూ (బీఆర్ఎస్ అనుబంధ), సీఐటీయూ కూటమికి 788 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకి 672 ఓట్లు దక్కాయి. బీజేపీ అనుబంధ సంఘం బీఎంఎస్కు కేవలం 70 ఓట్లు పోలవగా, రెండు ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. కూటమి విజయంతో బీఆర్టీయూ, సీఐటీయూ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు.