హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకుంటున్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి నాటకాలాడారాని విమర్శించారు. బీసీల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్‌గాంధీ రాలేదని, కనీసం పార్లమెంట్లో మాట్లాడ లేదని ధ్వజమెత్తారు.