హైదరాబాద్ : బీఆర్ఎస్వీ(BRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో(Medical education) స్థానికత నిర్ణయించటానికి జీవో నంబర్ 33ని ఉప సం హరించి, కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చెస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. అంతకు ముందు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్ట డికి సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదంచోటు చేసుకుంది .
BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మరియు BRSV నాయకులు అరెస్ట్
రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యలో స్థానికత నిర్ణయించటానికి జీవో నంబర్ 33ని ఉపసంహరించి కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చెస్తు BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి… https://t.co/Y3uKau20pH pic.twitter.com/IiUNisACvf
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు.
బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు.. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. pic.twitter.com/YSjb1delLj
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024