హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల గురించి ఇష్టారీతిన మాట్లాడితే నాలుక కోస్తామంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కడారి స్వామి యాదవ్, పడాల సతీశ్ హెచ్చరించారు. ఉస్మానియా విద్యార్థులను అవమానించిన రేవంత్‌రెడ్డి గురించి నీతులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ నేత మానవతారాయ్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గురువారం ఓయూలో వారు మాట్లాడుతూ ‘మరోసారి బీఆర్ఎస్ నాయకుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే బట్టలిప్పి ఆర్ట్స్ కాలేజీ ముందు నిలబెడుతం బిడ్డా ఖబడ్దార్’ అని హెచ్చరించారు.
మానవతారాయ్కి కాంగ్రెస్‌లో కార్పొరేషన్ పదవి కాదు గదా.. ఓయూలో అటెండర్ పోస్టు కూడా దొరకదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలపై మానవతారాయ్, కైలాస్ నేత, చారకొండ వెంకటేశ్ మరోసారి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని చెప్పారు. ఓయూ విద్యార్థులు బీరు, బిర్యానీలకు ఆశ పడుతారని రేవంత్‌రెడ్డి అన్నప్పుడు మానవతారాయ్ ఎకడ పడుకున్నాడని నిలదీశారు.
‘ఎన్నికల ముందు మూట కోసం బీఆర్ఎస్లో చేరి రేవంత్‌రెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడిన నువ్వు ఇప్పుడు నీతులు చెబితే ఎవరూ నమ్మరు’ అని దుయ్యబట్టారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జహీర్‌ఖాన్, జంగం అవినాష్, నూకల యుగంధర్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, ఎన్ రాజు, జిల్లా నాగయ్య, మిథున్ ప్రసాద్, బాలు పాల్గొన్నారు.