BRSV | హైదరాబాద్ : ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. పోరాటాలకు ఊపిరిలూదిన విద్యార్థిలోకంపై కక్షగట్టింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో ఆందోళనలపై నిషేధం విధించిన నేపథ్యంలో బీఆర్ఎస్వీ శ్రేణులు అసెంబ్లీని ముట్టడించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో పాటు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయా పోలీసు స్టేషన్లకు బీఆర్ఎస్వీ శ్రేణులను తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఓయూ వీసీ ఇచ్చిన సర్క్యూలర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు చేయడం అన్యాయం. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డి దారిన రావచ్చు.. కానీ ఓయూ విద్యార్థులు విద్య, నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్పా? అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్వీ శ్రేణులు నినాదాలు చేశారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు @GelluSrinuBRS ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించిన బీఆర్ఎస్వీ శ్రేణులు
♦️అడ్డుకున్న పోలీసులు.. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తదితరులు అరెస్టు
♦️సీఎం రేవంత్ రెడ్డి డౌన్.. డౌన్ అంటూ మార్మోగిన నినాదాలు
♦️ఓయూ వీసీ ఇచ్చిన సర్క్యూలర్… pic.twitter.com/zCjr3uarcT
— BRS Party (@BRSparty) March 17, 2025