కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలకు ఓ నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా అని ప్రశ్నించారు. బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముందు బీఆర్ఎస్వీ మెరుపు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. ఒక మైనర్ బాలిక మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని నేరస్థుల్లా వేధించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
“బేటీ బచావో” అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ నాయకత్వం, ఇప్పుడు కేంద్ర మంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని వారు ప్రశ్నించారు. ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. బాధితురాలిపైనే ఎదురు కేసులు నమోదు చేయడం అమానుషమని మండిపడ్డారు. హనీ ట్రాప్, వసూళ్ల పేరుతో ఒక మైనర్ బాలికను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైనర్ బాలికపై అత్యాచారం చేసి పోక్సో (POCSO) కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై చర్యలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ.. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో డీజీపీ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థి నాయకులు.
ఈ సందర్భంగా… pic.twitter.com/paZJCLoXIB
— BRS Party (@BRSparty) May 10, 2026
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి బాధిత కుటుంబానికి అన్యాయం చేస్తున్నాయనే అనుమానం ప్రజల్లో పెరుగుతుందని వారు అన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీజేపీ నాయకత్వం తీవ్ర స్థాయిలో స్పందించేదని.. కానీ ఒక మైనర్ బాలికకు సంబంధించిన ఈ ఘటనలో రాష్ట్ర బీజేపీ నేతలు నోరుమెదపకపోవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. “సాధారణ ప్రజలకు ఒక న్యాయం.. కేంద్ర అధికార పార్టీల నేతల కుటుంబ సభ్యులకు మరో న్యాయమా?” అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా అమలుకావాలని సూచించారు. నిందితుడైన బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.