BRSV | హైదరాబాద్ : గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ నాయకులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, చాటరి దశరథ్, జంగయ్య, శ్రీను నాయక్, నాగేందర్, నాగారం ప్రశాంత్, అవినాష్, బొల్లు నాగరాజు, కట్ట శ్రీను, కొల్లూరు సాయి గౌడ్ లను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థుల కోసం శాంతియుతంగా, అనుమతితో సమావేశం నిర్వహించుకునే హక్కును కూడా సీఎం రేవంత్ రెడ్డి కాలరాస్తున్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం అని మండిపడ్డారు