BRSV | హైదరాబాద్ : సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ తెలిపారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో జగదీష్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో పాలన చేతకాక, ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా, ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల గొంతుకగా అసెంబ్లీలో నిలదిస్తూ, ప్రజల కోసం ప్రజల పక్షాన ఉంటూ పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ది చెప్తారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుంటే ,రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద తిరుగుబాటు చేస్తామని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు.