MLC Kavitha | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీసీపీ దార కవితకు బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా తుంగబాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, పార్టీ నాయకులు, అధికారిక ఖాతాలలో ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారి కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా, అసభ్యకరంగా పోస్టులను పెడుతూ అవమానించారని పేర్కొన్నారు. కవిత ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారి ఖాతాలోని పోస్టులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్, మేకల విద్యాసాగర్ పాల్గొన్నారు.