రాష్ట్రంలో రైతులు వరి నాట్లేసి నెలన్నర గడిచింది. కానీ అన్నదాతకు ఒక్కపూట కూడా తిరం లేకుంటయింది. పంటకు వేయాల్సిన ఎరువు కోసం రైతులు రేయింబవళ్లు దుకాణాల చుట్టూ తిరగడమే సరిపోతున్నది. ఎరువు వెయ్యకపోతే మొత్తంగా పంట దిగుబడిపైనే ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎలాగైనా ఎకరాకు ఒక్క సంచైనా దక్కించుకుని పంటను కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాటపడుతున్నారు. యారియా ఇవ్వలేని పాలకులు… తమను రైతులే కాదంటే కూడా ఆవేదనను పంటి బిగువున పెట్టుకుని దుకాణాల ముందు క్యూకట్టి నిల్చుంటున్నారు. సమాజానికి అన్నం పెట్టాలనే రైతన్న ఆరాటం… తనకు బతుకుపోరాటంగా మారుతున్నది. ఈ క్రమంలో యూరియా కోసం అరిగోస పడుతున్న అన్నదాతకు బీఆర్ఎస్ భరోసాగా నిలుస్తున్నది.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 23: మహబూబ్‌నగర్ పాత బస్టాండ్ దగ్గర్లోని ఎరువుల దుకాణం వద్ద క్యూలో నిల్చున్న రైతులతో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. వారి ఆవేదనను తెలుసుకున్నారు. రైతులను రైతులే కాదంటూ మంత్రులు బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్లీ ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులను తీసుకొచ్చిందని విమర్శలు గుప్పించారు.
అన్నదాతకు ఫిట్స్.. దవాఖానకు తరలింపు
శ్రీనివాస్‌గౌడ్ రైతులను పరామర్శిస్తున్న సమయంలో అక్కడే అలసిపోయి పడుకున్న ఓ రైతుకు ఫిట్స్ వచ్చింది. వెంటనే స్పందించిన శ్రీనివాస్‌గౌడ్, తోటి రైతులు బాధితుడికి సపర్యలు చేసి, అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. ఈ సందర్భంగా అతడిని దవాఖానకు తరలించేందుకు అంబులెన్స్‌కు కాల్ చేస్తే అర్ధ గంట తర్వాత వచ్చిందని శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు..
గులాబీ జెండా.. కర్షకులకు అండ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్‌లో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా, రాస్తారోకో ఉద్రిక్తతకు దారి తీసింది. చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు తరలిరాగా.. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంతో తోపులాట జరిగింది. బీఆర్ఎస్ నేత మహిపాల్‌రావు గాలి బొటన వేలు చిట్లి గాయమైంది.
రేపు యూరియా కోసం ధర్నా
రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ రేపు (సోమవారం) మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఏఐకేఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు, ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యూరియా కొరతను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ వ్యాపారుల బ్లాక్ దందాను అడ్డుకోవాలని పేర్కొన్నారు.
ఎప్పుడిస్తరో తెల్వదు… పడిగాపులు తప్పదు
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పీఏసీఎస్ వద్ద రైతుల నిరీక్షణ
మా గోడు ఎవరికి చెప్పినా ఒక్కటే!
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో యూరియా కోసం బర్రెకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు
తగ్గేది లేదు.. వదిలేదు లేదు
సిద్దిపేట జిల్లా అల్వాల గ్రామంలో యూరియా దొరకలేదనే ఆవేదనతో రైతు వేదికలో ఏవోం, ఏఈవోను బంధించిన రైతులు, రైతువేదిక లోపల కూర్చున్న అధికారులు
యూరియా ఇస్తేనే ఇంటికి పోతం…
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అల్వాల రైతు వేదిక వద్ద యూరియా కోసం క్యూలో పట్టాపాస్‌బుక్ జిరాక్సు కాపీలు పెట్టి నిరీక్షిస్తున్న రైతులు
కదిలివచ్చినకర్షకులు… పొద్దంతా బారులు
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ సహకార సంఘం కార్యాలయం వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు
పొలం చూసుకోవాలా… రోడ్డెక్కాలా..?
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో యూరియా బస్తాల కోసం రైతులు శనివారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
కొట్లాట కొత్తగాదు.. రైతు ఓడిపోడు
కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో బస్తాండ్ వద్ద రాస్తారోకో నుంచి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు
యూరియా కోసం అరిగోస..
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పీఏసీసీఎస్ వద్ద క్యూలైన్లో పడిగాపులు కాస్తున్న రైతులు
క్యూలైన్లో కర్షకుల కష్టాలు..
మహబూబాబాద్ జిల్లా గూడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరిన మహిళా రైతులు
ఎప్పుడిస్తరో చెప్పరు..
అందుకే క్యూలో చెప్పులుసిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అక్కిరెడ్డిపల్లి ఫర్టిలైజర్ షాప్ వద్ద క్యూలో చెప్పులు
పదండి ముందుకు.. పదండి తోసుకు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో యూరియా దొరకక ఆగ్రహంతో పీఏసీఎస్ గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులు
ఎరువుల కోసం తప్పని పరుగులు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సొసైటీలో కేవలం టోకెన్లు ఇస్తున్నట్టు మైక్‌లో అనౌన్స్ చేయగానే వందలాది మంది రైతులు ఇలా పరుగులు తీశారు.
ఎరువుల కేంద్రం వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కేంద్రం వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతును దవాఖానకు
తరలిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తోటి రైతులు