BRSLP | హైదరాబాద్ : రేపట్నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో జరగనున్న ఈ భేటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ హాజరు కానున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలను గెలుపొందిన సంగతి తెలిసిందే.