హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి (BRS) శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం జరిగి వచ్చే జూన్ 2వ తేదీ నాటికి తొమ్మిదేళ్లు పూర్తయ్యి, పదో ఏడు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు ఈ దశాబ్ది ఉత్సవాలు కొనసాగనున్నాయి.