KTR | హైదరాబాద్ : మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. పోస్టాఫీస్‌లో ఖాతా ఉంటేనే రూ.2500 జమ చేస్తారనే ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీంతో ఆడబిడ్డలు ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్నారు. అంతేకాదు జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. గత రెండు వారాల నుంచి ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎంత పాపం చేశావ్ రేవంత్ అని కేటీఆర్ మండిపడ్డారు. నిన్నటిదాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టావు. ఇప్పుడు.. మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి అక్కచెల్లెళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తావా..? ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటాదా..? అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కోటిమందిని కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం గ్యారెంటీ కార్డులో పెట్టిన రూ. 2500 మహాలక్ష్మిని హామీని ఇప్పటికైనా నెరవేర్చు. లేకపోతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో మహాలక్ష్మి పథకం కోసం మొదలైన ఇలాంటి ఘర్షణలు పల్లెపల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త..!! అని రేవంత్‌ను కేటీఆర్ హెచ్చరించారు.
ఎంత పాపం చేశావ్ రేవంత్..
నిన్నటిదాకా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టావు..
ఇప్పుడు.. మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి అక్కచెల్లెళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తావా ??
ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటాదా??
కోటిమందిని కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు కనీసం గ్యారెంటీ… pic.twitter.com/q3OqnKWUX6
— KTR (@KTRBRS) August 7, 2025