KTR | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థపై సోయిలేని సీఎం విద్యార్థులు లేరన్న కారణంతో ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 1,864 సూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గిందని, ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సరార్ అస్తవ్యస్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు లేరంటూ సూళ్లను మూసివేయడం, టీచర్లను డిప్యుటేషన్‌పై ఇతర సూళ్లకు పంపడంతో చాలాచోట్ల విద్యార్థులకు ప్రభుత్వ విద్య దొరకని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
స్కూళ్ల మూసివేత సమాజానికి మంచిది కాదు
గురుకుల సూళ్లలో జరుగుతున్న సంఘటనలు, వసతి గృహాల్లో విషాహారం, భద్రతలేని పరిస్థితులు, విద్యార్థులు లేరంటూ సూళ్లను మూసివేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిసుతన్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లను మూసివేయటం తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సూళ్లలో డ్రాఫౌట్స్ను నివారించేందుకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా తెచ్చామని, తద్వారా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పోటీపడే పరిస్థితి వచ్చిందని ఆయన వివరించారు.
విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరని, సీఎంకు విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాజకీయాలు, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప ప్రజల సమస్యలపై సోయి ఉందా ? అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసేందుకు విద్యావేత్తలు, మంత్రులతో కూడిన కమిటీ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
విద్యార్థులకంటే జూపార్క్ ముఖ్యమా?: కేటీఆర్
తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఓవైపు గురుకుల విద్యార్థినులు వీధుల్లో పోరాటం చేస్తుంటే, మరోవైపు హైదరాబాద్‌లో ఇంకో జూపార్క్ నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, సీఎంకు విద్యార్థుల కంటే జూ పార్క్ నిర్మాణమే ఎక్కువా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఎందుకు శిక్షిస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరారు. విధ్వంసకర రాజకీయాలను మాని ఉజ్వల భవిష్యత్తును నిర్మించే అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. పాలమాకుల సూల్ను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలిచిన మాజీమంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.