KTR | హైదరాబాద్ : వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలక్షణమైన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న పంటలకు అద్దం పడుతున్న ఫొటోలతో పాటు ఇతర సమస్యలకు సంబంధించిన ఫొటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏ ఫొటో గ్రాఫర్ కూడా తీయడానికి ఇష్టపడని చిత్రాలు.. కానీ ఇవే తెలంగాణలో నేటి వాస్తవికతకు అద్దం పట్టే చిత్రాలు అని పేర్కొన్నారు.
సాగునీళ్లు అందక ఎండిపోయిన పంటలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు..
రుణమాఫీ ఎప్పుడవుతుందో ఎదురుచూసి అలసిపోయిన అన్నదాతలు..
ఓవైపు పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం..
యూరియా కోసం రైతులు కడుతున్న అంతులేని క్యూలు..
ఇందిరమ్మ ఇళ్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న మహిళలు..
కళ్ల ముందే సొంతిల్లు నేలమట్టమవుతుంటే గుండె పగిలేలా రోదిస్తున్న అభాగ్యులు..
ఉద్యోగాలు ఏవీ అని నిలదీసిన యువతకు లాఠీలే సమాధానం..
తెలంగాణకు కావాల్సింది ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు కావు.. కావాల్సింది సబ్బండవర్ణాల పురోగతి అని కేటీఆర్ పేర్కొన్నారు.
On #WorldPhotographyDay, here’s an album no photographer ever wanted to capture; tragic frames from Telangana
⭕️ Dried-up lands and farmers still waiting for the loan waiver they were promised
⭕️ Endless queues for urea while crops wither and hope dries out
⭕️ Women still… pic.twitter.com/PxGtYK6MwU
— KTR (@KTRBRS) August 19, 2025