KTR | హైదరాబాద్ : కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్లో ట్రిపుల్ ఆర్, సోలార్ పవర్ ప్లాంట్లను నిరసిస్తూ బాధిత రైతులు చేస్తున్న దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ కుటుంబ సభ్యుల సొంత ఆస్తులు పెంచుకునేందుకు చేస్తున్న ఈ కుట్రలను అడ్డుకుంటాం అని తేల్చిచెప్పారు. వారి అనునయులకు దోచిపెట్టేందుకు రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. మీకు అన్ని రకాలుగా న్యాయ పరంగా కొట్లాడేందుకు అండగా ఉంటాం. మా హయాంలో రైతులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది. మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉంటారు అని కేటీఆర్ స్పష్టం చేశారు.