KTR | హైదారాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయరు. ఈ రేస్ కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమే అని కేటీఆర్ పేర్కొన్నారు.
కడియం శ్రీహరిని కాపాడేందుకు దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం పరువు పోతుందని ముందుగానే ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.