KTR | హైదరాబాద్ : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కేటీఆర్ అజీజ్ నగర్లోని వారి నివాసానికి వెళ్లి శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు.