KTR | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతున్న విద్యార్థులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెస్ట్ విషెస్ చెప్పారు. ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా ఉంటూ మీ వంతు కృషి చేయండి అని కేటీఆర్ సూచించారు. మీ కష్టానికి తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలకు ఉదయం 8:45 గంటలలోపు వస్తేనే అనుమతిస్తామన్న నిబంధన పెట్టినా.. 9:05 గంటల వరకు వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య వెల్లడించారు. ఈ సారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షకు అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే ఉదయం 8:45 గంటల వరకు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని హాల్‌టికెట్లపై ముద్రించిన మాట వాస్తవమేనని, విద్యార్థులు త్వరగా పరీక్షాకేంద్రాలకు వస్తే టెన్షన్‌కు గురవకుండా పరీక్షరాస్తారన్న ఆలోచనతో అలా ముద్రించామని తెలిపారు.
Best wishes to all Intermediate students appearing for their exams!
Stay confident, stay calm, and give it your best.
May your hard work be rewarded with excellent results.
— KTR (@KTRBRS) March 4, 2025