KTR | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ ప్రాంతాలను చూస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ స్పందించారు. #CongressFailedTelangana హ్యాష్‌ట్యాగ్ జోడించారు.
– లగచర్ల గ్రామం
– సుంకిశాల
– హైడ్రా కూల్చేసిన ఏ ప్రాంతమైనా
– మూసీ కూల్చివేసిన ప్రాంతాలు
– హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి
– ఫుడ్ పాయిజన్‌తో చనిపోయిన 100 మంది గురుకుల విద్యార్థుల కుటుంబాల్లో ఏదైనా
– ఆత్మహత్య చేసుకున్న 500కి పైగా రైతు కుటుంబాల్లో ఏదైనా
– ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ప్రాంతం
– ఫోర్త్ సిటీ (ఫోర్ బ్రదర్ సిటీ)
– అశోక్ నగర్( అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చిన ప్రాంతానికి)
ఈ ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన నష్టాన్ని మరింత బాగా తెలుసుకోవడానికి మీకు అద్భుతమైన సమయం లభిస్తుందని ఆశిస్తున్నానని రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. ఇది కుదరకపోతే ఈడీ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో మీ రెవెన్యూ మంత్రిని అడిగి తెలుసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.