హైదరాబాద్, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంత ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ధైర్యం చెప్పారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. గురువారం మూసీ పరీవాహక ప్రాంతానికి చెందిన పలువురు తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ సరార్ తమ ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నదని, తమకు అండగా ఉండాలంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు పేదలను కబ్జాదారులనడం దారుణమని మండిపడ్డారు. బాధితులకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ నాయకులను సంప్రదించాలని సూచించారు.