KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభాగ్యుల కన్నీళ్లు తుడవలేని అమానవీయ సర్కార్ ఇది అని కేటీఆర్ విమర్శించారు.
అది ఎస్ఎల్బీసీ సొరంగం అయినా, సిగాచీ పరిశ్రమ అయినా, హైదరాబాద్ వరదలయినా, ప్రతి చోటా అదే నేరపూరిత నిర్లక్ష్యం, అదే చేతగానితనం అని రేవంత్ రెడ్డి సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు. వరదనీటి నాలాల్లో ముగ్గురు గల్లంతై నాలుగు రోజులు దాటినా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడిగి చూస్తుందని మండిపడ్డారు.
ప్రాణాలు ఎలాగూ కాపాడలేరు.. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే కనీసం పార్దివదేహాలు అయినా వెలికితీయలేని అసమర్ధ ప్రభుత్వం ఇది! అభాగ్యుల కన్నీళ్ళు తుడవలేని అమానవీయ సర్కారు ఇది! అని కేటీఆర్ విమర్శించారు.
అది ఎస్ఎల్బీసీ సొరంగం అయినా,
సిగాచీ పరిశ్రమ అయినా,
హైదరాబాద్ వరదలయినా,
ప్రతి చోటా అదే నేరపూరిత నిర్లక్ష్యం,
అదే చేతగానితనం!వరదనీటి నాలాల్లో ముగ్గురు గల్లంతై
నాలుగు రోజులు దాటినా
చేష్టలుడిగి చూస్తున్న కాంగ్రెస్ సర్కార్!ప్రాణాలు ఎలాగూ కాపాడలేరు
దురదృష్టవశాత్తూ ఎవరైనా… pic.twitter.com/puDrWygMvq— KTR (@KTRBRS) September 18, 2025