KTR | ఖమ్మం : ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలవలేదు.. కానీ కలిస్తే తప్పేంటి..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నీకేం నొచ్చిందని రేవంత్ రెడ్డిని కేటీఆర్ నిలదీశారు. ఖమ్మం జిల్లాలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
నేను అర్ధరాత్రి పోయి లోకేశ్‌ను కలిసానట. మేం ఏం జేసిన బాజాప్తా చేస్తాం. బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెల్వక అడుగుతా.. లోకేశ్ నీలాగా ఏమైనా అంతర్ రాష్ట్ర దొంగనా..? లోకేశ్ నీలాగా ఏమైనా సంచులు మోసినోడా..? లోకేశ్ నీలాగా ఏమైనా చదువు రానోడా..? కలవలేదు కానీ కలిస్తే తప్పేంది..? అని రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు.
పక్క రాష్ట్ర మంత్రి, యువకుడు. నాతో డెఫినెట్‌గా సత్సంబంధాలు ఉన్నాయి. మేం ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాం. కలవలేదు కానీ కలిస్తే తప్పేంది..? అయినా ఆయన మీ పెద్ద బాస్ చంద్రబాబు కొడుకే కదా..? నేనోదో గూండాను.. దావూద్ ఇబ్రహీమ్‌ను చీకట్లో కలిసినట్లు ఆ డైలాగులు ఏందిరా హౌలా..? నేను అడిగింది ఏంది..? నేను చెప్పింది ఏంది…? నేను ఏమైనా నీలాగా దొంగను కలిశానా..? నీలాగా నేను లోఫర్ రాజకీయాలు చేస్తున్నానా ఢిల్లీలో. చీకట్లో పోయి అమిత్ షా కాళ్లు పట్టుకుని, మోదీగారి పాదాలకు ప్రణమిల్లి చిల్లర రాజకీయం చేస్తున్నానా..? పక్క రాష్ట్రం మంత్రి యువకుడు నాకు తమ్ముడి లాంటోడు కలిస్తే కలుస్తా.. కానీ కలవలేదు. దానికేదో ఆయన గొప్ప విషయం కనిపెట్టినట్టు. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్నే బీఆర్ఎసోళ్లను కలుస్తారు. దోపిడీ గురించి తెలుసుకోవాలంటే నిన్ను కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం నొచ్చింది. నీకేం బాధ అయితుంది. ఈ చిల్లర మాటలతోని ఎన్నిరోజులు టైం పాస్ చేస్తవ్. ఎన్ని రోజులు ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేస్తవ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.