KTR | హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
నీతి ఆయోగ్ చివరి సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించారు. కానీ నిన్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడమే కాకుండా.. ప్రధాన మంత్రితో రేవంత్ రెడ్డి సరదాగా గడుపుతూ కనిపించారు. ఏం అద్భుతం జరిగిందో..? నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్లో రేవంత్ పేరును చేర్చడం వల్లే ఈ పని జరిగిందని అనుకుంటున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Niti Aayog’s last meeting was boycotted by Telangana CM Revant Reddy
But yesterday, he not only attended the same but was also seen schmoozing with the PM
Wonder what changed?
Naming him in the ED Chargesheet of National Hearlad case did the trick I guess 😁… pic.twitter.com/Mtj0VFEw8Z
— KTR (@KTRBRS) May 25, 2025