KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గింది అని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోంది. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా, విద్యార్థులకు మంచి భోజనం పెట్టకుండా, అప్పులతో ఏం చేస్తున్నారో ప్రభుత్వం బయటపెట్టాలి. ఆరు గ్యారంటీల అమలు సంగతేమో కానీ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీగా ఖతం పట్టించింది అని కేటీఆర్ మండి పడ్డారు.
కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే.. అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. రూ. 2,738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్లో చూపారు. మొదటి త్రైమాసికానికే రూ. 10,583 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. మూడు నెలల్లోనే రూ. 20,266 కోట్లు అప్పుగా తీసుకున్నారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలు అయ్యింది. ఒక్క రోడ్డు వేయలేదు.. ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో పైలట్లో ఉందని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెబుతారు? ? అని కేటీఆర్ని లదీశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉందో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
This is a serious Red Flag!
I never thought we would have to witness this – the latest CAG Report screams alarm bells. There is a sharp decline in Telangana’s growth
A failed Congress party’s governance results in a failed economy. They promised 6 guarantees but delivered only… pic.twitter.com/nl2Duu4xzm
— KTR (@KTRBRS) August 11, 2025