KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసమే కమిటీ ఏర్పాటైందన్నారు. ఆటో డ్రైవర్ల ప్రతినిధులతో బీఆర్ఎస్ కార్మిక నేతలు చర్చిస్తారు. ఓలా, ఉబెర్, ఇతర ట్యాక్సీ డ్రైవర్లతోనూ తమ నేతలు చర్చిస్తారని పేర్కొన్నారు. కార్మిక నేతల నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.