మహబూబ్ నగర్ : జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ( Laxmareddy ) కి బీఆర్ఎస్ శ్రేణులు, ఘనస్వాగతం ( Grand Welcome ) పలికారు.అడుగడుగునా కేటీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా బాలానగర్ మండలం పెద్దాయిపల్లి చౌరస్తాలో కేటీఆర్ బీఆర్ఎస్ ( BRS ) పార్టీ జెండాను ఆవిష్కరించారు. జడ్చర్ల గులాబీ దండు చూపించిన ప్రేమకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ కేటీఆర్ , మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ముందుకు సాగారు. హైద్రాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పొడవునా జడ్చర్ల నియోజకవర్గ కార్యకర్తల ఉత్సాహాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందిం చారు.
ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకొని సత్తా చాటినందుకు కేటీఆర్ ప్రశంసించారు. ప్రత్యేకంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నాయకత్వంలో మరింత బలంగా పోరాడాలని పార్టీశ్రేణులకు సూచించారు.